BJP Bus Yatra Telangana : గెలుపే లక్ష్యం బస్సు యాత్రకు సిద్దం
బండి సారథ్యంలో బీజేపీ మాస్టర్ ప్లాన్
BJP Bus Yatra Telangana : దేశ వ్యాప్తంగా పాదయాత్రల కాలం నడుస్తోంది. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలలో ఆయా పార్టీలన్నీ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఇక దేశ వ్యాప్తంగా విస్తరించిన భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాదిన పాగా వేయాలని కంకణం కట్టుకుంది. ఇప్పటికే ట్రబుల్ షూటర్ గా పేరొందిన బీఎల్ సంతోష్ సారథ్యంలో యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది.
మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాలకు పాలక్ లను నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర(BJP Bus Yatra Telangana) చేపట్టారు.
ప్రధానంగా రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ కేసీఆర్, ప్రభుత్వాన్ని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే ముగింపు సభ కూడా పూర్తయింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక తాజాగా కాషాయ పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.
జనవరి 16 నుంచి బండి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. స్టేట్ చీఫ్ తో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అన్ని నియోజకవర్గాలలో వేర్వేరుగా పర్యటించనున్నారు.
దీని వల్ల కాలం కలిసొస్తుంది. ఎన్నికల్లో మరింత బలం పుంజుకునేందుకు తోడ్పడుతుందని పార్టీ అంచనా వేస్తోంది. ఆ దిశగా యాక్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఒక్క పార్లమెంట్ లోని నియోజకవర్గాలను బేస్ గా చేసుకుని యాత్ర సాగుతుంది. అనంతరం ఆ పార్లమెంట్ స్థానంలో బహిరంగ సభ ఉండేలా చూస్తోంది.
Also Read : ఊపిరి ఆగింది గుండె పగిలింది