Assam CM Kharge : ఖర్గే రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ – సీఎం
హిమంత బిస్వా శర్మ షాకింగ్ కామెంట్స్
Assam CM Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై నిప్పులు చెరిగారు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ(Assam CM). పదే పదే బీజేపీని టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టారు. ముందు పార్టీలో నీ స్థానం ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఎం సంచలన కామెంట్స్ చేశారు. ఖర్గే రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కామెంట్స్ తో కాంగ్రెస్ అధ్యక్షుడికి ఏపాటి గౌరవం ఉందో అర్థమైందన్నారు హిమంత బిస్వా శర్మ. పార్టీలో ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఇక ఎవరి కోసం , ఎందు కోసం పాదయాత్ర చేస్తున్నారో రాహుల్ గాంధీకి క్లారిటీ లేదని మండిపడ్డారు సీఎం.
కాంగ్రెస్ పార్టీలో కేవలం పదవులు అలంకార ప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. పవర్ అంతా గాంధీ ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుందన్నారు. ఖర్గే కేవలం చెప్పు కోవడానికి మాత్రమే పనికి వస్తారని అన్నారు సీఎం. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చలు అన్నీ ఒక డ్రామా అని , ఎన్నికల్లో అవకతకలు చోటు చేసుకున్నామని తాను మొదటి రోజు నుంచి చెబుతూ వచ్చానని అన్నారు.
ఆనాడు కాంగ్రెస్ నేతలు తనను టార్గెట్ చేశారని కానీ అదే పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు అవి నిజమని రూఢీ అయ్యిందన్నారు హిమంత బిస్వా శర్మ(Assam CM).
ఇప్పుడు తాను చేసిన ఆరోపణలకు గాంధీ కుటుంబం ఏం సమాధానం చెబుతుందో చెప్పాలన్నారు సీఎం.
Also Read : ఉమా భారతి షాకింగ్ కామెంట్స్