N Chandrababu Naidu : జగన్ పాలనలో బీసీలకు అన్యాయం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
N Chandrababu Naidu : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఆయన పాలన గాడి తప్పిందని, అప్పులు తప్ప అభివృద్ది అన్నది లేకుండా పోయిందన్నారు. ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు.
కానీ వైసీపీ పాలనలో కొందరికే మేలు జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలిలో ఇదేం ఖర్మ బీసీలకు అంటూ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు(N Chandrababu Naidu) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగంచారు. ముందు బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ అంశంపై చర్చించేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ రెడ్డికి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కుల వృత్తులను కావాలని కించ పరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు లేక పోతే మనం లేమని గుర్తుంచు కోవాలని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బహుజనులను గుర్తించామని, వారు పనులు చేసేందుకు గాను పని ముట్లను కూడా ఇచ్చామన్నారు.
కానీ జగన్ రెడ్డి వచ్చాక ఆయా వర్గాలను కావాలని పక్కన పెట్టారంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. అంతకుముందు చిత్తూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దు మణిగింది.
మరో వైపు కందుకూరులో చోటు చేసుకున్న ఘటన చివరకు రాజకీయ వివాదం చోటు చేసుకుంది. ఇక ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ బాబుపై నిప్పులు చెరిగారు. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : చంద్రబాబు నిర్వాకం కందుకూరు విషాదం