TSPSC Group 2 Jobs : నిరుద్యోగులకు కొలువుల పండుగ
కొత్త సంవత్సరంలో నైనా భర్తీ జరిగేనా
TSPSC Group 2 Jobs : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టుండి మనసు మార్చుకుంది. వరుస నోటిఫికేషన్లకు అనుమతి ఇస్తూ పరేషాన్ చేస్తోంది. ఇదంతా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురు కాకుండా ఉండేందుకే ప్లాన్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్ -1 పరీక్ష నిర్వహించినా దానిపై అనుమానాలు వ్యక్తం చేశారు అభ్యర్థులు. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్ -2(TSPSC Group 2 Jobs) కింద భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
మొత్తం 783 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇదిలా ఉండగా జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇప్పటి వరకు గ్రూప్ -1 , గ్రూప్ – 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
వీటితో పాటు హాస్టల్ వార్డెన్ , హార్టికల్చర్ , నీటి పారుదల శాఖ, పశు సంవర్ధక శాఖ, పోలీసు శాఖ, విద్యా శాఖ, వ్యవసాయ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజుల మోత మోగిస్తున్నారని, కట్టలేక పోతున్నామని విద్యార్థులు, అభ్యర్థులు, నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు.
కనీసం ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మానవతా దృక్ఫథంతో ఆలోచించాలని విన్నవించారు. ఇక ప్రభుత్వం మాటలు చెబుతోందే తప్పా ఒక్క పోస్టును భర్తీ చేసిన దాఖాలు లేవని విమర్శలు ఉన్నాయి.
ఇకనైనా పారదర్శకతతో పరీక్షలు నిర్వహించాలని జాబర్స్ కోరుతున్నారు. తెలంగాణ సర్కార్ పై తమకు నమ్మకం లేదంటున్నారు.
Also Read : సైంటిస్ట్ ‘మహిమ’కు అరుదైన గౌరవం