TSPSC Group2 Syllabus : గ్రూప్ -2లో కీలక మార్పులు
ప్రకటించిన టీఎస్పీఎస్సీ
TSPSC Group2 Syllabus : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ -3, గ్రూప్ -4 , ఇతర శాఖలకు సంబంధించి జాబ్స్ భర్తీకి రిలీజ్ చేసినా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. తాజాగా గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనవరి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం 783 పోస్టులు భర్తీ చేయనుంది. జోనల్ , మల్టీ జోనల్ తో పాటు స్టేట్ క్యాడర్ కు సంబంధించిన పోస్టులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గతంలో నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షలో ఇంటర్వ్యూ ఉండేది. కానీ కొత్తగా ప్రకటించిన గ్రూప్ -2 పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ . ఇంటర్వ్యూ ను రద్దు చేసింది. కేవలం రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్స్ భర్తీ చేస్తుంది.
ఆయా పోస్టులకు సంబంధించి డిగ్రీ, మ్యాథ్స్ , ఎకనామిక్స్ , కామర్స్ , లా ప్రాతిపదికగా డిగ్రీతో పాటు ఎంఏ సోషల్ వర్క్ , సైకాలజీ, క్రిమినాలజీ, కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ , తదితర అర్హతలు(TSPSC Group2 Syllabus) నిర్దేశించేంది. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మొత్తం గ్రూప్ -2లో నాలుగు పేపర్లు ఉంటాయి.
ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ , జనరల్ ఎబిలిటీస్ 150 మార్కులు 150 నిమిషాలు . 2వ పేపర్ లో హిస్టరీ , పాలిటీ అండ్ సొసైటీ 150 మార్కులు 150 నిమిషాలు ఉంటుంది. భారత్ , తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర. రాజ్యాంగం, రాజకీయాలు ఉంటాయి.
ఇక 3వ పేపర్ లో ఆర్థిక అభివృద్ది 150 మార్కులు 150 నిమిషాలు. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ .సమస్యలు సవాళ్లు . తెలంగాణకు సంబంధించి కూడా. 4వ పేపర్ లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావంకు సంబంధంచి 150 నిమిషాలు 150 మార్కులు ఉంటాయి.
Also Read : టీఎస్పీఎస్సీ గ్రూప్ -3 నోటిఫికేషన్