Amit Shah Campaign : కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ప్రచారం
శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా
Amit Shah Campaign : గుజరాత్ లో అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన మరోసారి పాగా వేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం కన్నడ నాట కాషాయ ఎన్నికల ప్రచారాన్ని(Amit Shah Campaign) ప్రారంభించారు ఆ పార్టీకి చెందిన ట్రబుల్ షూటర్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇప్పటికే వ్యూహాలు పన్నడంలో కీలకంగా వ్యవహరించే బీఎల్ సంతోష్ కూడా ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం.
గతంలో ఎన్నడూ లేని రీతిలో కర్ణాటకలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వంపై అవినీతి, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే సీఎంగా ఉన్న బీఎస్ యెడియూరప్పను తప్పించింది. ఆయన స్థానంలో బస్వరాజ్ బొమ్మైని తీసుకు వచ్చింది. పార్టీ పరంగా సున్నితంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఎదుర్కొంటున్నారు సీఎం.
మరో వైపు దేశ వ్యాప్తంగా కర్ణాటక వార్తల్లో ఉంటూ వచ్చింది. మతం పేరుతో దాడులు జరగడం, హిజాబ్ వివాదం, కేసులు, అరెస్ట్ లు, హత్యలు, ఆందోళనలు, నిరసనలతో హోరెత్తింది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ ఆదరణ లభించింది.
ఇదే క్రమంలో మరోసారి కన్నడ నాట పవర్ లోకి తీసుకు వచ్చే పనిని భుజాన వేసుకున్నారు అమిత్ షా. ఇప్పటికే ఆయన గుజరాత్ లో మిషన్ ను సక్సెస్ చేశారు. ఆయన ఫోకస్ ఇప్పుడు కర్ణాటక మీద పడింది. ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ఆయన కల. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Also Read : విశాఖ కోసం ధిక్కార స్వరం