Toilet Papers Twitter : టాయిలెట్ పేపర్లతో ట్విట్టర్ ఆఫీసుకు
మస్క్ టార్చర్ దెబ్బకు ఉద్యోగులు విలవిల
Toilet Papers Twitter : టెస్లా చైర్మన్ , ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ దెబ్బకు ఉద్యోగులు విలవిల లాడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక గజ గజ వణుకుతున్నారు. విచిత్రం ఏమిటంటే ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి కాపలాదారులను తొలగించడం. దీంతో ట్విట్టర్ లో పని చేస్తున్న ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ఇంటి నుంచి పని చేసేందుకు తాను ఒప్పుకోనని చెప్పాడు. ఎవరైనా సరే ఆఫీసుకు రావాల్సిందేనంటూ హుకూం జారీ చేశాడు. గత్యంతరం లేక చాలా మంది ఉద్యోగులు వస్తున్నారు. కానీ టాయిలెట్ కు సంబంధించి తమంతకు తామే స్వంతంగా టాయిలెట్ పేపర్లను తెచ్చుకుంటున్నారు.
రోజు రోజుకు ఎలోన్ మస్క్ టార్చర్ ఒత్తిడి తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు ఎంప్లాయిస్. ఇప్పటికే టాప్ ఎగ్జిక్యూటివ్ లను సాగనంపాడు ఎలోన్ మస్క్. ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వస్తూనే కాస్ట్ కటింగ్ పేరుతో 9 వేల మందికి పైగా ఉద్యోగులను సాగనంపాడు. నెట్ కనెక్టివిటీ కూడా ఉండదని స్పష్టం చేశాడు.
దీంతో ఉద్యోగులు లబోదిబోమన్నారు. ఇదిలా ఉండగా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంది. తప్పని పరిస్థితుల్లో తమంతకు తామే స్వంతంగా టాయ్ లెట్ పేపర్లను (Toilet Papers Twitter) తీసుకు రావాల్సి వస్తోందని వాపోయారు. పని వారు లేక పోవడంతో బాత్రూంలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఎలోన్ మస్క్. కష్ట పడి పని చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫలితాలు రాక పోతే మూసి వేస్తానని అన్నాడు.
Also Read : ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్