Anjani Kumar CM KCR : సీఎంకు పోలీస్ బాస్ థ్యాంక్స్
కొత్త పోలీస్ బాస్ గా బాధ్యతలు స్వీకరణ
Anjani Kumar CM KCR : తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ బాస్ గా అంజనీ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టారు. శనివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఇప్పటి వరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ నుంచి బాధ్యతలు స్వీకరించారు కొత్త బాస్ అంజనీ కుమార్. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొత్త బాస్ ఆ వెంటనే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లారు. మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తనకు డీజీపీగా ఛాన్స్(Anjani Kumar CM KCR) ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు డీజీపీ అంజనీ కుమార్.
ప్రస్తుతం ఇంఛార్జ్ డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ స్థానంలో రాచకొండ పోలీస్ కమిషనర్ గా ఉన్న మహేష్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీపీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
ఇక అంజనీ కుమార్ ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నారు. పాట్నా పూర్వ విద్యార్థి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఉత్తమ హార్స్ రైడర్ గా పేరు పొందారు. డిసెంబర్ 25, 2021న యాంటీ కరప్షన్ బ్యూరోకు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. మార్చి 12, 2018లో కమీషనర్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు.
లా అండ్ ఆర్డర్ కు అదనపు డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. అదనపు పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. నిజామాబాద్ రేంజ్ పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నారు. గ్రేహౌండ్స్ చీఫ్ గా కూడా ఏపీ, తెలంగాణ కు పని చేశారు అంజనీ కుమార్.
కీలకమైన పోస్టు కట్టబెట్టడం తో సంతోషానికి గురయ్యారు అంజనీ కుమార్.
Also Read : హిందూ ధర్మాన్ని కించపరిస్తే జాగ్రత్త