Putin Zelensky Wishes : విజయం మాదే ఎవరి ధీమా వారిదే
పుతిన్..జెలెన్ స్కీ షాకింగ్ కామెంట్స్
Putin Zelensky Wishes : కొత్త సంవత్సరం 2023లో కీలకమైన వ్యాఖ్యలకు తెర లేపారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్. గత ఏడాది ఊహించని రీతిలో ఉక్రెయిన్ పై యుద్దాన్ని ప్రకటించింది రష్యా. యావత్ ప్రపంచం మొత్తుకున్నా వినలేదు. తాను తగ్గేదే లేదంటూ ప్రకటించాడు పుతిన్.
మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. చైనా ఈ విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తుండగా అమెరికా, యురోపియన్ దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ యుద్దం ఎన్నటికీ మంచిది కాదంటూ ఐక్య రాజ్య సమితి ఇప్పటికే స్పష్టం చేసింది. మరో వైపు భారత దేశం కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది.
యుఎన్ భద్రతా సమితి కీలక సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము యుద్దం విషయంలో ఎవరికీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని వెల్లడించారు. అంతే కాదు ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిస్కరించు కోవాలని అటు జెలెన్ స్కీకి ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు(Putin Zelensky Wishes) తేల్చి చెప్పారు.
అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు జై శంకర్. ఇదిలా ఉండగా పలుమార్లు ప్రదానమంత్రి మోదీ కూడా పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. యుద్దాన్ని ఆపాలని, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడవద్దని కోరారు.
అయితే తమను ఆపమని చెప్పే ముందు అమెరికా, యురోపియన్ దేశాలకు చెప్పాలని సూచించారు పుతిన్. ఈ తరుణంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుతిన్ , జెలెన్ స్కీ. ఇద్దరూ తాము విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. ఎవరి ధీమా వారు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : శాంతి పరిరక్షకుల పాత్ర ప్రశంసనీయం