Sanjay Raut Rahul : రాహుల్ హవా కొనసాగితే పవర్ ఖాయం
శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కామెంట్స్
Sanjay Raut Rahul : శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్(Sanjay Raut) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నారు. ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది.
గత కొంత కాలంగా పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమయంలో రాహుల్ యాత్ర ఆ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చింది. ఈ తరుణంలో సంజయ్ రౌత్ రాహుల్ గాంధీ యాత్ర గురించి వ్యాఖ్యానించారు. గత ఏడాది 2022 రాహుల్ కు మంచే జరిగింది. ఒక రకంగా ఆయన భారత్ జోడో చేపట్టడం మంచి పరిణామం. తనకు వ్యక్తిగతంగా పార్టీకి కూడా ఇమేజ్ తీసుకు వచ్చేలా చేసిందన్నాడు సంజయ్ రౌత్(Sanjay Raut).
ఇదే హవా 2023లో కొనసాగిస్తే రాబోయే 2024లో జరిగే సార్వ్రతిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దానితో కలిసి సాగుతున్న పార్టీలు ప్రభావం చూపగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు శివసేన ఎంపీ. అయితే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం కొత్త విభజనకు దారి తీస్తుందని పేర్కొన్నారు.
ఇదే ఆదరణ కొనసాగుతూ పోతే గనుక దేశంలో రాజకీయ పరంగా కొత్త మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు సంజయ్ రౌత్. శివసేన పార్టీకి చెందిన మౌత్ పీస్ సామ్నా లో తన వారాంతపు కాలమ్ రోఖ్ థోక్ లో రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ.
Also Read : హీరా బెన్ మోదీ జ్ఞాపకం పదిలం