LPG Cylinder Hike : గ్యాస్ వినియోగదారులకు ఝలక్
కొత్త ఏడాదిలో కోలుకోలేని షాక్
LPG Cylinder Hike : కొత్త సంవత్సరంలో ఆరంభంలోనే కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ తరుణంలో నిత్యం వంటకు ఉపయోగించే గ్యాస్ విషయంలో మరో కీలక ప్రకటన చేసింది.
కొత్తగా శుభవార్త చెబుతుందని ఆశించిన ఎల్పీజీ గ్యాస్ వాడకందారులకు బిగ్ ఝలక్ ఇచ్చింది. మొదటి రోజే తల్లడిల్లేలా చేసింది. వినియోగదారులకు కేంద్రం చేదువార్త చెప్పింది. వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై(LPG Cylinder Hike) ఏకంగా రూ. 25 పెంచింది.
ఇక ఇవాళ పెంచిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా చమురు సంస్థలు పెంచిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపించడం, తక్షణమే ఆమోదిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. ఇప్పటికే పెంచిన ధరలతో ఇబ్బంది పడుతుంటే పుండు మీద కారం చల్లినట్లు కేంద్రం మరోసారి గ్యాస్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు వినియోగదారులు.
ఆదివారం పెరిగిన ధరలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1768కి చేరింది. ఇక ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో రూ. 1721కి పెరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో రూ. 1870 ఉండగా చెన్నైలో రూ. 1917కు చేరడం విశేషం.
ఇక నిత్యం వాడే గృహ వినియోగదారులకు మాత్రం ఉపశమనం కలిగింది. గతంలో ఉన్న ధరలే ప్రస్తుతం ఉన్నాయి.
Also Read : నగరం అద్భుతం అభివృద్దికి సోపానం