TSPSC JOBS : మ‌రిన్ని కొలువుల‌కు నోటిఫికేష‌న్స్

విడుద‌ల చేసిన టీఎస్పీఎస్సీ

TSPSC JOBS : కొత్త ఏడాది 2023లోనైనా తెలంగాణ ప్ర‌భుత్వం పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తుందా అన్న అనుమానం నెల‌కొంది అభ్య‌ర్థుల్లో. వ‌రుస‌గా వివిధ శాఖ‌ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి యుద్ద ప్రాతిప‌దిక‌న తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేష‌న్లు(TSPSC JOBS)  విడుద‌ల చేస్తూ వ‌స్తోంది.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టుకు సంబంధించి నియామ‌క ఉత్త‌ర్వులు జారీ కాలేదు. తాజాగా వివిధ శాఖ‌ల‌లో ఖాళీల‌కు సంబంధించి మ‌రో నాలుగు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు 491 ఉండ‌గా , ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్లు 29, లైబ్రేరియ‌న్లు 24 ను భర్తీ చేయ‌నుంది.

ఇక ఇంట‌ర్ సాంకేతిక విద్య‌లో లైబ్రేరియ‌న్లు 71 పోస్టులు ఉండ‌గా ర‌వాణా శాఖ‌లో ఏఎంవీఐ పోస్టులు 113 భ‌ర్తీ చేయ‌నుంది. పుర‌పాలిక శాఖ‌లో అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు సంబంధించి 78 జాబ్స్ ను భ‌ర్తీ చేయ‌నుంది టీఎస్ పీఎస్సీ(TSPSC JOBS) . ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 21 నుంచి ఆన్ లైన్ లో చాన్స్ ఉంది.

మొత్తం 806 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్లు , లైబ్రేరియ‌న్ల‌కు క‌లిపి మొత్తం 544 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. జ‌న‌వ‌రి 31 నుంచి ప్రారంభ‌మై ఫిబ్ర‌వ‌రి 20 దాకా కొన‌సాగనుంది. ఇక ఇంట‌ర్ విద్య‌, సాంకేతిక విద్య‌లో 71 లైబ్రేరియ‌న్ పోస్టుల‌కు సంబంధించి జ‌న‌వ‌రి 21న ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అవుతాయి.

ఫిబ్ర‌వ‌రి 10 ఆఖ‌రు తేది. ర‌వాణా శాఖ‌లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్ట‌ర్ పోస్టులు 113, పుర‌పాలిక‌ల్లో అకౌంట్స్ ఆఫీస‌ర్ పోస్టులు 78 ఉన్నాయి. జ‌న‌వ‌రి 20న ద‌ర‌ఖాస్తులు ప్రారంభం అవుతాయి. ఫిబ్ర‌వ‌రి 11 ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆఖ‌రు తేది.

Also Read : గ్రూప్ -2లో కీల‌క మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!