KTR : నగరం అద్భుతం అభివృద్దికి సోపానం
తెలంగాణకు హైదరాబాద్ కేరాఫ్
KTR : భాగ్యనగరం దేశానికే తలమానికంగా మారిందన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR). యావత్ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని ఇదంతా తాము పవర్ లోకి వచ్చాక జరిగిందన్నారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , తదితర రంగాలలో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు కేటీఆర్.
ప్రస్తుతానికి కోట్లాది మందికి ఈ మహా నగరం కల్పతరువుగా మారిందని ప్రశంసలు కురిపించారు మంత్రి. దేశంలో ఎన్నో నగరాలు ఉన్నా హైదరాబాద్ మాత్రం నెంబర్ వన్ లో ఉందన్నారు. మిగతా నగరాలు భాగ్యనగరం దరిదాపుల్లోకి రావడం లేదన్నారు. ముందస్తు చూపు కలిగిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఆయన సారథ్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఎక్కడా లేని విధంగా పురోభివృద్ది కొనసాగుతోందన్నారు. ఇదిలా ఉండగా ఎస్సార్డీపీలో భాగంగా నగరంలోని కొత్తగూడలో నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ప్రతి ఒక్కరు హైదరాబాద్ అభివృద్ది గురించి చర్చిస్తున్నారంటే దాని ఘనత కేవలం కేసీఆర్ వల్లేనని కితాబు ఇచ్చారు కేటీఆర్(KTR). ఇవాళ ఎక్కడ చూసినా భాగ్యనగరం అద్భుతంగా కనిపిస్తోందన్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణంతో మరింత అందాన్ని తీసుకు వచ్చేలా చేసిందన్నారు మంత్రి.
రాష్ట్రంలో కరెంట్ సమస్యను తీర్చిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. వచ్చే 50 ఏళ్లకు సరిపడా నీటి సమస్య లేకుండా చేశామన్నారు. ఈ క్రెడిట్ కూడా కేసీఆర్ కే లభిస్తుందన్నారు కేటీఆర్.
Also Read : ఈరోజే ముఖ్యం రేపటితో అనవసరం