Sandeep Singh Resigns : హర్యానా మంత్రి సింగ్ రాజీనామా
సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా
Sandeep Singh Resigns : హర్యానా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ కు కొత్త సంవత్సరం అచ్చొచ్చినట్లు లేదు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హాకీ మహిళా కోచ్ ను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాధితురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి సందీప్ సింగ్(Sandeep Singh Resigns) గత్యంతరం లేక పదవి నుంచి తప్పుకున్నారు.
లైంగిక వేధింపులకు తాను పాల్పడలేదని కావాలని ఇరికించాలని చేశారంటూ ఆరోపించారు సందీప్ సింగ్. ఇదిలా ఉండగా హర్యానా మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. హాకీ మహిళా కోచ్ ను వేధించినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్దమంటూ ఆరోపించారు.
గతంలో సందీప్ సింగ్ భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించారు. ఇదిలా ఉండగా తాను మంత్రి ఇంటికి వెళ్లానని, తనను లైంగికంగా హింసించాడంటూ మహిళా కోచ్ వాపోయింది. నేరుగా ఠాణాకు వెళ్లింది.
అంతే కాకుండా ఎఫ్ఐఆర్ లో కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అథ్లెటిక్స్ , క్రీడాకారులు నల్లగా ఉంటారని కానీ పిల్లలకు కోచింగ్ ఇచ్చే నువ్వు చాలా అందంగా ఉన్నావని , కోచ్ గా ఎందుకు కష్ట పడతావంటూ వెకిలి చేష్టలు చేశాడంటూ ఆరోపించింది.
తాను చెప్పినట్లు చేస్తే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ చెప్పాడని తెలిపింది. మహిళా కోచ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు సందీప్ సింగ్(Sandeep Singh Resigns). మంత్రిపై విచారణకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీకే అగర్వాల్ , రోహతక్ రేంజ్ అదనపు డైరెక్టర్ జనరల్ మమతా సింగ్ నేతృత్వంలో విచారణ చేపట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
Also Read : రాహుల్ హవా కొనసాగితే పవర్ ఖాయం