Assam CM PM Modi : మోదీ మ‌ళ్లీ ప్ర‌ధాని కావ‌డం ఖాయం

అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ

Assam CM PM Modi : అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని(Assam CM PM Modi) త‌ట్టుకునే శ‌క్తి ఎవ‌రికీ లేద‌న్నారు. అంతే కాదు ఈ దేశంలో ఎవ‌రూ ఆయ‌న ద‌రిదాపుల్లోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

రాబోయే ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌నతా పార్టీ గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ కొలువు తీర‌డం ప‌క్కా అని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది 2023లో మొత్తం ఎనిమిది రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక 2024లో దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ , తెలంగాణ‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర‌, మేఘాల‌య‌, నాగాలాండ్ రాష్ట్రాల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో కూడా త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు హిమంత బిశ్వా శ‌ర్మ‌. దేశంలో పీఎం ప‌ద‌వికి ఏకైక అభ్య‌ర్థి న‌రేంద్ర మోదీ అని పేర్కొన్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీకి ఢోకా లేద‌న్నారు సీఎం(Assam CM PM Modi). కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఉన్నా ఒక‌టే లేన‌ట్టేన‌ని పేర్కొన్నారు. భార‌త్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు అస్సాం సీఎం. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో న‌రేంద్ర మోదీ మ‌ళ్లీ ప్ర‌ధాన‌మంత్రి అవుతార‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

అయితే ఉన్న‌త‌మైన ప‌ద‌విగా భావించే ప్ర‌ధాని పోస్ట్ ను ఎవ‌రైనా ఆశించ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. ఇందులో రాహుల్ కావ‌చ్చు లేదా నితీశ్ , మ‌మ‌తా, ప‌వార్ ఎవ‌రైనా కావ‌చ్చంటూ ఎద్దేవా చేశారు.

Also Read : సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్

Leave A Reply

Your Email Id will not be published!