Vaikunta Ekadashi : ఏకాదశి పర్వదినం పోటెత్తిన భక్తజనం
ఏపీ, తెలంగాణ ఆలయాలు భక్తులతో కిటకిట
Vaikunta Ekadashi : వైకుంఠ ఏకాదశి శుభదినం కావడంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో నిండి పోయాయి. ఇక కోట్లాది మంది భక్తుల్ని కలిగి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కొలువు తీరిన తిరుమల వేలాది మంది భక్తులతో క్రిక్కిరిసి పోయింది. ఇసుక వేస్తే రాలనంత భక్త జనం వైకుంఠ ఏకాదశి రోజు పోటెత్తారు స్వామి దర్శనం కోసం.
ఓ వైపు భక్తులు మరో వైపు ప్రముఖులు పోటా పోటీగా దర్శనానికి రావడంతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తలకు మించిన భారంగా మారింది ఏర్పాట్లు చేయలేక. సోమవారం అర్ధరాత్రి(Vaikunta Ekadashi) నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. విజయవాడ లోని కనకదుర్గమ్మ, సత్యనారాయణ స్వామి, శ్రీకాళహాస్తిశ్వర గుడి, శ్రీశైలం మల్లన్నతో పాటు ఒంటిమిట్ట, తిరుమల, మంత్రాలయంకు భక్తులు బారులు తీరారు.
ఇక తెలంగాణలో పేరొందిన భద్రాచలం సీతారామచంద్ర స్వామి , యాదగిరిగుట్ట, వేములాడ రాజన్న, జోగుళాంబ దేవాలయాలు భక్తులతో నిండి పోయాయి. ఇక తిరుమలకు సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల దాకా శ్రీవాణి టోకెన్లు పొందిన వారికి దర్శనం కల్పించారు.
ఈనెల 11 దాకా సామాన్యులకు దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు. ఇక శ్రీవారిని దర్శించుకున్న వారిలో మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే , కర్ణాటక గవర్నర్ గెహ్లాట్ , జమ్మూ ఎల్జీ మనోజ్ సిన్హా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపీ, తెలంగాణ మంత్రులు పెద్దిరెడ్డి, రాంబాబు, గంగుల, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ , విశ్వరూప్ , తదితరులు దర్శించుకున్నారు.
Also Read : కరోనా భయం టీటీడీ అప్రమత్తం