Supreme Court Digital : సుప్రీం తీర్పు నివేదిక‌లు ఇక ఫ్రీ

డిజిట‌ల్ యాక్సెస్ కు ప్రాజెక్టుకు ఓకే

Supreme Court Digital : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కొలువు తీరాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు హైకార్టులు, జిల్లా , ఇత‌ర కోర్టుల‌కు సంబంధించి కేసుల తీర్పుల నివేదిక‌ల‌ను ఇక నుంచి ఉచితంగా తీసుకునే అవ‌కాశానికి శ్రీ‌కారం చుట్టారు.

ఈ మేర‌కు ఈ కొత్త ప్రాజెక్టుకు సోమ‌వారం శ్రీ‌కారం చుట్ట‌నున్నారు సీజేఐ చంద్ర‌చూడ్. అధికారిక న్యాయ నివేదిక‌లో భాగంగా కోర్టు తీర్పుల డిజిట‌ల్ వెర్ష‌న్ ను అందించ‌నుంది కోర్టు. న్యాయ వ్య‌వ‌స్థ డిజిట‌లైజేష‌న్ కు మ‌రో అడుగు ముందుకేసింది కోర్టు.

న్యాయ‌వాద విద్యార్థులు, న్యాయ‌వాదులు, సామాన్య ప్ర‌జ‌ల‌కు త‌న తీర్పుల‌కు సంబంధించిన అధికారిక న్యాయ నివేదిక‌ల‌ను ఉచితంగా పొందే ప్రాజెక్టును సుప్రీంకోర్టు ప్రారంభించ‌నుంది.

ఎల‌క్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఇ-ఎస్సీఆర్) ప్రాజెక్టును ముందుకు రానుంది. న్యాయ‌మూర్తుల లైబ్ర‌రీ , సంపాద‌కీయ విభాగం అధికారుల‌తో కూడిన బృందం అవిశ్రాంతంగా ప‌ని చేశారు.

15 రోజుల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో దాదాపు 34,013 తీర్పుల‌ను ఇందులో పొందు ప‌రిచారు. పుణె లోని ఎన్ఐసీతో క‌లిసి సుప్రీంకోర్టు అభివృద్ది చేసిన సెర్చ్ ఇంజిన్ అవ‌స‌రాల‌కు త‌గిన డేటా బేస్ ను రూపొందించారు.

1950 నుండి 2017 వ‌ర‌కు సుప్రీంకోర్టు నివేదిక‌ల డిజిట‌లైజేష‌న్(Supreme Court Digital)  , స్కానింగ్ , పీడీఎఫ్ ఫార్మాట్ లో డిజిట‌లైజ్డ్ సాఫ్ట కాపీలో భ‌ద్ర‌ప‌ర్చారు. ఇ-ఎస్సీఆర్ ప్రాజెక్టు సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అందుబాటులోకి వ‌స్తుంది. ఇది భార‌త సుప్రీంకోర్టు మొబైల్ అప్లికేష‌న్స్ తో పాటు నేష‌న‌ల్ జ్యుడీషియ‌ల్ డేటా గ్రిడ్ జ‌డ్జిమెంట్ పోర్టల్ లో అందుబాటులోకి వ‌స్తుంది.

Also Read : నోట్ల ర‌ద్దుపై ‘సుప్రీం’ కీల‌క తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!