Covid 19 Cases : కరోనా కేసులతో పరేషాన్
24 గంటల్లో 173 కొత్త కేసులు
Covid 19 Cases : కరోనా కేసులు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే చైనాను వణికిస్తోంది. రోజుకు 9 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం హెచ్చరించింది. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. తాజాగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 2న సోమవారం కొత్తగా 173 కరోనా కేసులు(Covid 19 Cases) నమోదైనట్లు వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు కరోనా పరంగా చూస్తే ఆగస్టు 7, 2020న 20 లక్షలు నమోదు కాగా ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, అదే నెల 16న 50 లక్షలు దాటింది. ఇక క్రియాశీల కేసులకు సంబంధించి ఇన్ఫెక్షన్ లలో 0.01 శాతంగా నమోదైంది. ఇక యాక్టివ్ కేసుల పరంగా చూస్తే 2, 670 కి తగ్గాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో మొత్తం కరోనా కేసుల(Covid 19 Cases) సంఖ్య 4.46 కోట్లు గా నమోదయ్యాయి. దాదాపు 4,45,78,822 గా ఉన్నాయి. తాజాగా ఇద్దరి మరణంతో కలుపుకుంటే ఇప్పటి వరకు 5,30,707 కి చేరుకుంది. కేరళలో ఒకరు , ఉత్తరాఖండ్ లో మరొకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇక జాతీయ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని స్పష్టం చేసింది.
కొత్తగా నమోదైన వాటిలో 36 కేసులు తగ్గగా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,45,445కి పెరిగిందని కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైనట్లు తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 220.10 కోట్ల డోస్ ల కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది కేంద్ర మంత్రిత్వ శాఖ.
Also Read : టాటా వెటరన్ కృష్ణకుమార్ కన్నుమూత