Tejasvi Surya : కుమార కామెంట్స్ సూర్య సీరియస్
కేంద్ర మంత్రి అమిత్ షా కు నాజీ లక్షణాలు
Tejasvi Surya : కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇదే సమయంలో జేడీయూ చీఫ్ , మాజీ సీఎం కుమార స్వామి సంచలన కామెంట్స్ చేశారు. షాకు నాజీ లక్షణాలు ఉన్నాయంటూ ఆరోపించారు.
దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ తరుణంలో సోమవారం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(Tejasvi Surya) సీరియస్ గా స్పందించారు. కుమార స్వామి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. మరోసారి ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
అంతే కాదు అమిత్ షాను టార్గెట్ చేయడం విస్తు పోయేలా చేసిందన్నారు. అమిత్ షాను కుమార స్వామి రాజకీయ ఊసరవెల్లి అని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారంటూ అందుకే ఇలాంటి చవకబారు కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ తేజస్వి సూర్య. కర్ణాటకలో మళ్లీ భారతీయ జనతా పార్టీ పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
జేడీఎస్ పార్టీ ఇప్పటికే అంతరించి పోతున్నా పార్టీగా మారిందన్నారు ఎంపీ. ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోతుందని జోష్యం చెప్పారు. ఆయన వల్ల కర్ణాటకకు నష్టం తప్ప ఏం జరిగిందని ప్రశ్నించారు తేజస్వి సూర్య(Tejasvi Surya).
ఇదిలా ఉండగా కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది కోట్లాది మంది కన్నడిగుల ఏటీఎం అవుతుందన్నారు.
Also Read : మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయం