Rahul Gandhi Yatra : జోడో యాత్ర‌కు రాహుల్ స‌న్న‌ద్ధం

తిరిగి పాద‌యాత్ర‌కు యువ‌నేత రెడీ

Rahul Gandhi Yatra : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర జ‌న‌వ‌రి 3న మంగ‌ళ‌వారం తిరిగి ప్రారంభం(Rahul Gandhi Yatra) కానుంది. ఇప్ప‌టి కే ఆయ‌న త‌న యాత్ర‌ను 9 రాష్ట్రాల‌లో పూర్తి చేశారు. గ‌త ఏడాది 2022 సెప్టెంబ‌ర్ 6న త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభించారు.

ఈ యాత్ర దిగ్విజ‌యంగా న‌డిచింది. ప్ర‌ధానంగా రాహుల్ ఎక్క‌డికి వెళ్లినా జ‌నం ఆద‌రించారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మహారాష్ట్ర‌, మ‌ధ్య ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ , హ‌ర్యానా రాష్ట్రాల‌లో పూర్త‌యింది. రాహుల్ వెంట ఉప‌యోగిస్తున్న వాహ‌నాలు, డ్రైవ‌ర్లు, ఇత‌ర నేత‌ల‌కు కొన్ని రోజులు విశ్రాంతిని ఇచ్చారు.

ఇప్ప‌టికే శీతాకాలం వ‌ణికిస్తోంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం వేటినీ లెక్క చేయ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో రెడ్ ఫోర్డ్ కు చేరుకున్నాక స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ స‌భ‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు క‌మ‌ల్ హాస‌న్. ఇక యాత్ర‌లో(Rahul Gandhi Yatra) భాగంగా రేప‌టి నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

ఉద‌యం 10 గంట‌ల‌కు ఎర్ర‌కోట స‌మీపంలోని మ‌ర్ఘ‌ట్ వాలే బాబా, హ‌నుమాన్ మందిర్ నుండి తిరిగి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుంది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – లోని- స‌రిహ‌ద్దుకు చేరుకుంటుంది. భారీగా జ‌నం రావ‌డంతో ట్రాఫిక్ కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఢిల్లీ పోలీసులు కోరారు.

ఈ యాత్ర మ‌రో 50 రోజుల పాటు సాగ‌నుంది. ఇప్ప‌టికే 100 రోజులు పూర్తి చేసుకున్నారు రాహుల్ గాంధీ.

Also Read : ద్వేషం దేశానికి ప్ర‌మాదం – క‌మ‌ల్ హాస‌న్

Leave A Reply

Your Email Id will not be published!