Congress Protest : అరెస్ట్ అక్ర‌మం ధ‌ర్నా ఉద్రిక్తం

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఫైర్

Congress Protest : తెలంగాణ రాష్ట్రంలో స‌ర్పంచులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ధ‌ర్నాకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు, నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, మాజీల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

దీనిపై తీవ్రంగా మండిప‌డ్డారు. పోలీస్ ఉన్న‌తాధికారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏ అధికారంతో త‌న‌ను ఇక్క‌డ వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డి నిల‌దీశారు. విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి(Congress Protest)  చెందిన కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చారు.

దీంతో ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఇదే స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన వారంద‌రినీ పోలీసులు వ్యాన్ల‌లో త‌ర‌లించారు. మ‌రో వైపు బ‌య‌ట‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేసిన రేవంత్ రెడ్డిని అడ్డుకోవ‌డంతో కొంత ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ కు ఖాకీల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

అనంత‌రం బ‌ల‌వంతంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయ‌న నివాసం నుంచి నేరుగా బొల్లారం పోలీస్ స్టేష‌న్ కు త‌లించారు. అక్ర‌మంగా త‌మ నాయ‌కుడిని అరెస్ట్ చేశారంటూ భారీ ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స్టేష‌న్ వ‌ద్ద‌కు త‌ర‌లి వ‌చ్చారు. వారిని కంట్రోల్ చేయ‌డం ఇబ్బందిగా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. త‌న‌ను అరెస్ట్ చేసే అధికారం ఎవ‌రు ఇచ్చారంటూ మండిప‌డ్డారు. పోలీసులు అనుస‌రిస్తున్న వైఖ‌రి దారుణంగా ఉంద‌న్నారు నేత‌లు.

Also Read : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న – రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!