PAK Drone Siezed : పంజాబ్ వ‌ద్ద పాక్ డ్రోన్ స్వాధీనం

ఒక కేజీ హెరాయిన్ ల‌భ్యం

PAK Drone Siezed : దాయాది పాకిస్తాన్ త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. ప‌దే ప‌దే డ్రోన్ ల‌తో భార‌త్ స‌రిహ‌ద్దులోకి కావాల‌ని చొచ్చుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. భార‌త్ త‌గిన రీతిలో బుద్ది చెబుతూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ప‌లు డ్రోన్ల‌ను కూల్చి వేయ‌డం లేదా ధ్వంసం చేయ‌డం చేస్తూ వ‌చ్చింది. తాజాగా మ‌రో డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నాయి భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు.

విచిత్రం ఏమిటంటే ఇంత‌కు ముందు డ్రోన్ల‌లో ఇత‌ర మందుగుండు సామాగ్రి ఉండేది. కానీ ఈసారి ఏకంగా ఒక కేజీ హెరాయిన్ తో డ్రోన్ రావ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఏడాది 2022లో 22 పాకిస్తాన్ కు చెందిన డ్రోన్(PAK Drone Siezed)  ల‌ను గుర్తించింది. స్వాధీనం చేసుకుంది. మొత్తం 316.988 కిలోల హెరాయిన్ ను , 67 ఆయుధాల‌ను స్వాధీనం చేసుకుంది.

ఇదిలా ఉండ‌గా పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ) స‌మీపంలో బీఎస్ఎఫ్ సుమారు ఒక కిలో హెరాయిన్ తో కూడిన పాకిస్తాన్ డ్రోన్ ను స్వాధీనం చేసుకుంది. 3,323 కిలోమీట‌ర్ల పొడ‌వునా భార‌త దేశం, పాకిస్తాన్ స‌రిహ‌ద్దులో కాపలాగా ఉంటోంది భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం.

తాజాగా స్వాధీనం చేసుకున్న డ్రోన్ గురుదాస్ పూర్ లోని బోర్డ‌ర్ అవుట్ పోస్ట్ కొస్సోవాల్ కింద ఐబీ నుండి రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉండ‌గా క‌నుగొన్నారు. డ్రోన్ కు సంబంధించిన స‌మాచారాన్ని ఆ ప్రాంతంలోని రైతులు బీఎస్ ఎఫ్ కి అందించార‌ని ఆర్మీ వెల్ల‌డించింది.

Also Read : డ్రోన్ల‌తో వ‌రుస దాడులకు ర‌ష్యా ప్లాన్

Leave A Reply

Your Email Id will not be published!