Rajnath Singh : అరుణాచ‌ల్ లో రాజ్ నాథ్ సింగ్ ప‌ర్య‌ట‌న‌

భార‌త్ , చైనా దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

Rajnath Singh : కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు వెళ్ల‌నున్నారు. గ‌త నెల‌లో చైనా భార‌త్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ ఘ‌ర్ష‌ణ ఘ‌ట‌న త‌ర్వాత మొద‌టిసారి అక్క‌డి ప్రాంతాన్ని సంద‌ర్శించ‌డం కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి(Rajnath Singh). రాజ్ నాథ్ సింగ్ టూర్ లో భాగంగా సియాంగ్ జిల్లా లోని బోలెంగ్ స‌మీపంలో నిర్మించిన సియోమ్ వంతెన‌ను ప్రారంభిస్తారు.

బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ కు చెందిన 27 ప్రాజెక్టుల‌ను కూడా ఓపెన్ చేస్తారు. జన‌వ‌రి 3న మంగ‌ళ‌వారం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తారు. అక్క‌డ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌నున్నారు. తువాంగ్ సెక్టార్ లోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంట భార‌త్ , చైనా ద‌ళాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి.

ఇదిలా ఉండగా సియోమ్ న‌దిపై 100 మీట‌ర్ల పొడ‌వైన సియోమ్ వంతెన‌ను వ్యూహాత్మ‌కంగా నిర్మించారు. ఇది వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ సుదూర ప్రాంతాల‌కు సంబంధించి ద‌ళాల‌ను మోహ‌రించ‌డంలో సైనిక వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది. మ‌రో వైపు బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్ గ‌త ఐదు సంవ‌త్స‌రాల కాలంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో మొత్తం 3,097 కిలోమీట‌ర్ల రోడ్ల‌ను నిర్మించింది.

వాటిలో చాలా వ‌ర‌కు ముందుకు సాగే ప్రాంతాల‌కు దారి తీసింది. డిసెంబ‌ర్ 9న అరుణాచ‌ల్ లోని త‌వాంగ్ సెక్టార్ లోని యాంగ్ట్సే ప్రాంతంలో వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంట య‌థాత‌థ స్థితిని ఏక‌ప‌క్షంగా మార్చేందుకు చైనా సైనిక‌లు య‌త్నించార‌ని పార్ల‌మెంట్ లో వెల్ల‌డించారు. అయితే వారిని భార‌త సైన్యం ధైర్యంగా ఎదుర్కొంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : పంజాబ్ వ‌ద్ద పాక్ డ్రోన్ స్వాధీనం

Leave A Reply

Your Email Id will not be published!