Kumara Swamy Amit Shah : ఇక్కడ మీ రాజకీయాలు చెల్లవు
అమిత్ షా పై కుమార స్వామి ఫైర్
Kumara Swamy Amit Shah : కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా విపక్షాలను టార్గెట్ చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). ఆయన ఈసారి జేడీఎస్ ను టార్గెట్ చేశారు.
ఆ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లేనని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీని ఏటీఎం ఆఫ్ ఏ ఫ్యామిలీ అంటూ పేర్కొన్నారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ సీఎం కుమార స్వామి(Kumara Swamy). దేశంలో ఎక్కడైనా మీ రాజకీయాలు చెల్లుబాటు కావొచ్చేమో కానీ కన్నడ నాట అంత సీన్ లేదని హెచ్చరించారు.
మీ రాజకీయాలు ఇక్కడ వర్కవుట్ కావన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి, షాకు తమను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఇదిలా ఉండగా కుమార స్వామి కీలక ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనవరి 15న వచ్చే సంక్రాంతి తర్వాత ఎన్నికల కోసం పార్టీకి సంబంధించి అభ్యర్థుల రెండవ జాబితా ఉంటుందని స్పష్టం చేశారు మాజీ సీఎం(Kumara Swamy).
పార్టీ ఇప్పటికే 93 మంది అభ్యర్థులతో మొదటి లిస్టు ప్రకటించింది. ఈ సందర్భంగా కుమార స్వామి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎవరితోనూ పొత్తు ఉండదని అమిత్ షా అంటున్నారు. ఎవరు వారి గుమ్మం వద్దకు వెళ్లారు అని ప్రశ్నించారు. 120 సీట్లను దాటేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.
Also Read : రాహుల్ పై ఉమా భారతి సెటైర్