Telangana High Court Jobs : తెలంగాణ కోర్టుల్లో కొలువుల మేళా
1904 పోస్టులకు నోటిఫికేషన్
Telangana High Court Jobs : తెలంగాణలో నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది కోర్టు. రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
తాజాగా రాష్ట్రంలోని హైకోర్టు, జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న 1,904 పోస్టుల (Telangana High Court Jobs) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యధికంగా 1,226 ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టులు ఉన్నాయి. ఈనెల 11 నుంచి 31 దాకా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 15 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ , జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ , ప్రాసెస్ సర్వర్ , ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటికి ఆన్ లైన్ లో జనవరి 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈనెల 31వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.
మార్చిలో ఆయా పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు చేపడతారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్ట్రార్ వెల్లడించారు.
ఇక ఆయా పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు ఇతర సమాచారం కోసం హైకోర్టు అధికారిక
వెబ్ సైట్ http;//tshc.gov.in ను సంప్రదించాల్సి ఉంది. ఏమైనా అనుమానాలు ఉంటే 040- 23688394 నంబర్ కు హైకోర్టు పని రోజుల్లో ఫోన్ చేయాలని తెలిపారు.
ఆయా జాబ్స్ కు సంబంధించి 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల వరకు నిర్దేశించింది. ఇక రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 5 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్లు, వికలాంగులకు సంబంధించి 10 ఏళ్లు అవకాశం ఉంది.
Also Read : ఆ శాఖలో జాబ్ కొడితే భారీ వేతనం