Adhir Ranjan Chowdhury : వరుస దాడులపై ‘అధీర్’ ఆగ్రహం
రాష్ట్రాన్ని అవమానించారంటూ ఫైర్
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రం కావాలని బీజేపీయేతర రాష్ట్రాలను అవమానాలకు గురి చేస్తోందని ఆరోపించారు. బెంగాల్ లో వందే భారత్ రైలుపై జరిగిన దాడులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఢార్జిలింగ్ జిల్లా లోని ఫన్ సిదేవా ప్రాంతంలో రెండు కోచ్ లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు.
దీంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కేంద్రంలో పాలన పడకేసిందని మండిపడ్డారు అధీర్ రంజన్ చౌదరి. ఇక హౌరా నుండి న్యూ జల్ పై గురిని కలిపే సెమీ హై స్పీడ్ రైలుపై మాల్టా సమీపంలో దాడికి గురైందన్నారు. ఇలా దాడులు చేసుకుంటూ పోతే చివరకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు ఎంపీ.
మూడు రోజులలో రెండు సార్లు రైలు దాడికి గురైంది. ఇదేమైనా టీ20 క్రికెట్ మ్యాచా అని మండిపడ్డారు అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury). ఇలాంటి దాడుల వల్ల ప్రతిష్ట మసక బారుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పాలనా వైఫల్యానికి పరాకాష్ట. ఎవరిని ఉద్దరించాలని ఈ దాడులకు పాల్పడుతున్నారో చెప్పాలని నిలదీశారు కాంగ్రెస్ ఎంపీ.
వెంటనే దాడులకు ఎవరు పాల్పడినా క్షమించ కూడదని , వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే రైల్వేలు ప్రధాని నరేంద్ర మోదీవో లేదా సీఎం మమతా బెనర్జీవో కావు. అవి దేశ సొత్తు. అంటే 137 కోట్ల భారతీయుల ఆస్తి. వాటిని ధ్వంసం చేయాలని చూస్తే ఏం జరుగుతుందో తెలియదా అని ప్రశ్నించారు.
Also Read : దేశానికి మానవత్వమనే మతం కావాలి