CM Bommai : సిద్దరామయ్యను ప్రజలు క్షమించరు – బొమ్మై
కుక్క పిల్ల అంటూ సంబోదించిన మాజీ సీఎం
CM Bommai : కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వాతారణం వాడి వేడిగా కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత సీఎంగా ఉన్న బస్వరాజ్ బొమ్మై పై(CM Bommai) సంచలన కామెంట్స్ చేశారు.
ఆయనను కుక్క పిల్ల అంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన రూ. 5,495 కోట్లను కర్ణాటకకు తీసుకు రావడంలో ఘోరంగా సీఎం విఫలమయ్యారంటూ మండిపడ్డారు. మౌనంగా ఉంటే నిధులు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. కుక్క పిల్ల లాగా మౌనంగా ఉంటే ఎలా పనులు అవుతాయంటూ ఎద్దేవా చేశారు.
దీనిపై సీఎం బొమ్మై సీరియస్ గా స్పందించారు. తనను కుక్క పిల్ల అంటూ కామెంట్స్ చేసిన సిద్దరామయ్యకే వదిలి వేస్తున్నానని, అది ఆయన సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని సూచిస్తుందన్నారు సీఎం బస్వరాజ్ బొమ్మై. సిద్దరామయ్య ఎవరిని ఉద్దేశించి అన్నా అది మంచి పద్దతి కాదన్నారు. నమ్మకమైన కుక్కలా రాష్ట్ర ప్రజలకు విధేయుడిగా ఉంటానని స్పష్టం చేశారు సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai) .
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని అనేక ప్రాజెక్టులను కర్ణాటకకు అందించిన ప్రధాన మంత్రి మోదీ కామధేనుడు లాంటి వాడని బొమ్మై అన్నారు.
కర్ణాటక లోక్ సభకు 25 మంది బీజేపీ ఎంపీలను పంపింది. కర్ణాటకలో ఆపరేషన్ కమలం ద్వారా మీరు పవర్ లోకి వచ్చారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కోట్లు తీసుకు రావాలని సిద్దరామయ్య సవాల్ విసిరారు.
Also Read : మురుగ పీఠాధిపతి రిపోర్టుపై ఉత్కంఠ