Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసు మ‌రోసారి జాబితాకు

త్రివేది స్థానంలో మ‌రొక‌రు

Bilkis Bano Case : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బిల్కిస్ బానో కేసు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. త‌న కేసుకు సంబంధించి జీవిత ఖైదుకు గురైన 11 మంది దోషుల‌ను విడుద‌ల చేసింది గ‌త ఏడాది ఆగ‌స్టు 15న గుజ‌రాత్ ప్ర‌భుత్వం. దీనిపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీనిని స‌వాల్ చేస్తూ సాక్షాత్తు బాధితురాలు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానంను ఆశ్ర‌యించింది.

వారి వ‌ల్ల త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని వాపోయింది. ఇదిలా ఉండ‌గా ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి జాబితా చేసిన న్యాయ‌మూర్తుల‌లో ఇవాళ జ‌స్టిస్ బేలా ఎం త్రివేది త‌ప్పుకున్నారు. దీంతో బిల్కిస్ బానో కేసును(Bilkis Bano Case) ఇంకొక ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో జాబితా చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా బిల్కిస్ బానోతో పాటు మ‌రికొంద‌రు ఆమెకు మ‌ద్ద‌తుగా 11 మంది దోషుల విడుద‌ల‌ను స‌వాల్ చేస్తూ ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యాలు దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ కేసు మ‌రోసారి సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ గా మారింది.

కాగా జ‌స్టిస్ బేలా ఎం త్రివేది ఈ అంశాన్ని విచారించేందుకు నిరాక‌రించ‌డంతో బిల్కిస్ బానో దాఖ‌లు చేసిన ఒక ఫైల్ తో పీఐఎల్ లను ట్యాగ్ చేమ‌య‌ని కోర్టు ఆదేశించ లేదంటూ జ‌స్టిస్ ర‌స్తోగి అన్నారు.

ఇక పిటిష‌న్లు దాఖ‌లు చేసిన వారిలో నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఉమెన్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అన్నీ రాజా, సీపీఎం స‌భ్యురాలు సుభాషిణి అలీ, జ‌ర్న‌లిస్ట్ రేవ‌తి లాల్ , సామాజిక కార్య‌క‌ర్త‌, ప్రొఫెస‌ర్ రేఖా వ‌ర్మ , టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా ఉన్నారు.

Also Read : సిద్ద‌రామ‌య్య‌ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు – బొమ్మై

Leave A Reply

Your Email Id will not be published!