Covid 19 : పెరుగుతున్న కేసుల‌తో ప‌రేషాన్

దేశంలో కొత్త‌గా 188 కేసులు న‌మోదు

Covid 19 : క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ప్ర‌ధానంగా ప్ర‌పంచంలో ఎక్కువ‌గా చైనాను గ‌జ గ‌జ వ‌ణికిస్తోంది. దాని దెబ్బ‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని సూచించింది.

ఇక రోజు రోజుకు కేసులు(Covid 19) పెరుగుతుండ‌డంతో ఆందోళ‌న నెల‌కొంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో 188 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం ఇన్ఫెక్ష‌న్ ల‌లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయి.

మ‌రో వైపు 2,554 కి త‌గ్గాయి. గురువారం కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది కేసుల వివ‌రాల‌ను. ప్ర‌స్తుత కేసుల‌తో క‌లుపుకుంటే మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కేసుల సంఖ్య 4,46,79,319 గా న‌మోదైంది.

ఇక క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాల సంఖ్య 5,30,710కి చేరుకుంది. కేర‌ళ‌లో ముగ్గురు క‌రోనా(Covid 19) కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. వారం వారీగా చూస్తే సానుకూల‌త రేటు 0.12 శాతంగా ఉంద‌ని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక జాతీయ రిక‌వ‌రీ రేటు 98.80 శాతంగా ఉంది.

ఇక క‌రోనా మ‌హ‌మ్మారి నుండి కోలుకున్న వారి సంఖ‌ఖ్య 4,41,46,055కు పెరిగింద‌ని, మ‌ర‌ణాల సంఖ్య భారీగా త‌గ్గింద‌ని తెలిపింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 220.12 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు తెలిపింది కేంద్ర మంత్రిత్వ శాఖ‌.

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 28న 60 ల‌క్ష‌లు, అక్టోబ‌ర్ 11న 70 ల‌క్ష‌లు, 29న 80 ల‌క్ష‌లు, న‌వంబ‌ర్ 20న 90 ల‌క్ష‌లు , డిసెంబ‌ర్ 19, 2020న కోటి మార్కును అధిగ‌మించింది.

Also Read : విజ‌య్ మేనియా వ‌రిసు వారెవా

Leave A Reply

Your Email Id will not be published!