Bandi Sanjay : అరెస్ట్ అక్రమం ‘బండి’ ఆగ్రహం
Bandi Sanjay : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పోలీసు రాజ్యం నడుస్తోందంటూ మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్. బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు అభ్యర్థులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
అరెస్ట్ చేసిన కార్యకర్తలు, పోలీసు అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వారి పట్ల దారుణంగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు నియామక పరీక్ష పూర్తిగా అసంబద్దంగా ఉందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో నిబంధనలు పొందు పర్చారంటూ మండిపడ్డారు బండి సంజయ్(Bandi Sanjay).
పలుమార్లు ఈ రూల్స్ వద్దని చెప్పినా పట్టించు కోలేదన్నారు. మార్చాలని పలుమార్లు తాను కోరానని సీఎం స్పందించ లేదని, కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమై పోయారని , మొద్దు నిద్ర పోతున్నాడంటూ ధ్వజమెత్తారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తాను స్వయంగా సీఎం కేసీఆర్ కు లేఖ రాశానని చెప్పారు. కానీ అక్కడి నుంచి స్పందన లేదన్నారు.
ఇక సీఎం అండ చూసుకుని పోలీసులు రెచ్చి పోతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ స్టేట్ చీఫ్. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్న కేసీఆర్ కు గుణపాఠం తప్పదన్నారు బండి సంజయ్(Bandi Sanjay).
అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు బీజేపీ స్టేట్ చీఫ్.
Also Read : మాణిక్యం అవుట్ మాణిక్ రావు ఇన్