Mansukh Mandaviya : ఔష‌ధ రంగంలో స‌హ‌కారం అవ‌స‌రం

ఆరోగ్య అత్య‌వ‌స‌ర నివార‌ణ‌పై ఫోక‌స్

Mansukh Mandaviya : భార‌తదేశం ప్ర‌స్తుతం జీ20 శిఖ‌రాగ్ర గ్రూప్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచాన్ని ఎక్కువ‌గా వ‌ణికిస్తున్న స‌మ‌స్య క‌రోనా. దీనిని నివారించేందుకు కేంద్రం ఇప్ప‌టికే చ‌ర్య‌లు చేపట్టింది. ప్ర‌స్తుతం భార‌త దేశం పూర్తిగా ఆరోగ్య అత్య‌వ‌స‌ర నివార‌ణ‌పై దృష్టి పెడుతోంద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌(Mansukh Mandaviya).

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శాశ్వ‌త వైద్య ప్ర‌తిఘ‌ట‌న వేదిక‌ను రూపొందించ‌డం ద్వారా ఔష‌ధ రంగంలో స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయాల‌ని ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు. డిజిట‌ల్ హెల్త్ వ‌ర్క్ షాప్ వంటి సైట్ ఈవెంట్ ల‌ను కూడా ప్ర‌తిపాదించారు. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉందంటూ అభిప్రాయ‌ప‌డ్డారు.

వ‌న్ హెల్త్ విధానం, యాంటీ మైక్రోబ‌య‌ల్ రెసిస్టెన్స్ నిఘా ద్వారా ప్ర‌తిస్పంద‌న‌పై దృష్టి సారిస్తుంద‌న్నారు. దీనినే ముందుకు తీసుకు పోతుంద‌న్నారు మ‌న్సుఖ్ మాండ‌వీయ‌(Mansukh Mandaviya). వ‌న్ హెల్త్ విధానం మెరుగైన ప్ర‌జారోగ్య ఫ‌లితాల‌ను సాధించేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు జంతు ప్రాణుల‌ను కూడా కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ఆరోగ్య రంగాల మ‌ధ్య అంత‌ర్ విభాగ స‌హ‌కారాన్ని అందించేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు మ‌న్సుఖ్ మాండ‌వీయ‌. ప్రోగ్రామ్ లు, విధానాలు, ప‌రిశోద‌న రూప‌క‌ల్ప‌న‌, అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌హాయ ప‌డుతుంద‌న్నారు.

గ్లోబ‌ల్ హెల్త్ ఆర్కిటెక్చ‌ర్ కోసం బ‌హుళ ఫోర‌మ్ ల‌లో చ‌ర్చ‌ల‌ను స‌మ్మిళితం చేయ‌డంలో భార‌త దేశం ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు మ‌న్సుఖ్ మాండ‌వీయ‌.

Also Read : పెరుగుతున్న కేసుల‌తో ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!