Rahul Gandhi Yatra : దేశం కోసం ప్రేమను ఇవ్వండి – రాహుల్
ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతున్న యాత్ర
Rahul Gandhi Yatra : ఈ దేశానికి కావాల్సింది ద్వేషం కాదు కాసింత ప్రేమ అనే నినాదంతో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఆయనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పది రాష్ట్రాలను జల్లెడ పట్టారు.
3000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. గత ఏడాది 2022 సెప్టెంబర్ 6న భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ , హర్యానా, ఢిల్లీని చుట్టుముట్టారు. ఇప్పటికే దేశానికి చెందిన పలువురు ప్రముఖులు, సినీ హీరో హీరోయిన్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీతో జత కట్టారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి తిరిగి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర యూపీకి చేరుకుంది. విచిత్రం ఏమిటంటే ఆయన కు రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తో పాటు రామ మందిరం ట్రస్టు కార్యదర్శి చంపక్ రాయ్ మద్దతు ప్రకటించడం కలకలం రేపింది.
ఏకంగా పూజారి రాహుల్ గాంధీని(Rahul Gandhi Yatra) ప్రశంసిస్తూ లేఖ రాశారు. ఇది చర్చకు దారితీసింది. ఆయనకు శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని కోరారు. దేశం ఒక్కటిగా ఉండాలని కోరుతూ రాహుల్ చేపట్టిన యాత్ర దిగ్విజయం కావాలని కోరారు. ఈ తరుణంలో శుక్రవారం హర్యానా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర. ఇప్పటికే లక్షలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ దేశానికి కావాల్సింది మీ అందరి ప్రేమ అని పిలుపునిచ్చారు.
Also Read : దేశానికి మానవత్వమనే మతం కావాలి