MCD Mayor Election : ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ సీఎం కేజ్రీవాల్
MCD Mayor Election : పదిహేనేళ్ల భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా జరిగిన ఢిల్లీ మహా నగర పురపాలిక ఎన్నికల్లో ఆప్ దుమ్ము రేపింది. అధికారాన్ని చేజిక్కించుకుంది. బీజేపీ ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా తట్టుకుని నిలిచింది. ఇది తమ పనితీరుకు నిదర్శనమని పేర్కొంది.
మొత్తం 250 సీట్లకు గాను ఆప్ ఏకంగా 134 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 104 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉండగా అత్యంత కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జనవరి 6 శుక్రవారం జరగనుంది. ఇక సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీని గద్దె దించిన ఆప్ కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారి సమావేశం కానుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా , సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మరో వైపు రేపు జరిగే కీలక ఎన్నికకు సంబంధించి బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ప్రొటెం స్పీకర్ గా వీకే సక్సేనా నియమించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎసీఎస్ కి 20 మంది సభ్యులను నామినేట్ చేసిన తర్వాత నాటకీయంగా మేయర్ ఎన్నికకు(MCD Mayor Election) అధ్యక్షత వహించేందుకు బీజేపీకి చెందిన వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడాన్ని ఎల్జీ సక్సేనాపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో వైపు బీజేపీ తమ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు యత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం.
ఎన్నిక సందర్భంగా భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. ఏం జరుగుతుందనేది తేలాల్సి ఉంది.
Also Read : జనవరి 2024లో రామ మందిరం తెరుస్తాం