Nityanand Rai : విచార‌ణ చ‌ట్ట పాల‌న‌కు వెన్నెముక

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్

Nityanand Rai : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్(Nityanand Rai)  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విచార‌ణ , ప్రాసిక్యూష‌న్ అనేది అత్యంత కీల‌క‌మైన‌వ‌ని చ‌ట్ట పాల‌న‌కు వెన్నెముక‌గా నిలుస్తాయ‌ని అన్నారు. ప్ర‌త్యేకించి పోలీసుల‌ను మేధో ప‌రంగా, శారీర‌కంగా, సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నిత్యానంద్ రాయ్.

ఇదే సమ‌యంలో వారంద‌రినీ స్మార్ట్ ఫోర్స్ గా మార్చేందుకు కృషి చేయాల‌ని సూచించారు కేంద్ర మంత్రి. విచార‌ణ , ప్రాసిక్యూష‌న్ చ‌ట్టానికి మూల స్తంభాల‌ని స్ప‌ష్టం చేశారు. అందు వ‌ల్ల శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడేందుకు వీటిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నిత్యానంద రాయ్ .

గురువారం జైపూర్ లో జ‌రిగిన ప‌రిశోధ‌నా సంస్థ‌ల అధిపతుల మూడవ జాతీయ స‌ద‌స్సు జ‌రిగింది. ఈ కీల‌క స‌ద‌స్సుకు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్(Nityanand Rai)  ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అనంత‌రం ప్ర‌సంగిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసుల‌ను శ‌క్తిమంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక‌త‌, ప‌ర‌స్ప‌ర స‌మ‌న్వ‌యం చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం మారుతున్న నేరాల తీరుతో బ‌ల‌గాల‌కు అత్యాధునిక టెక్నిక్ ల వినియోగం త‌ప్ప‌నిస‌రి అయ్యింద‌ని పేర్కొన్నారు నిత్యానంద రాయ్. దేశ శాంతి, సామ‌ర‌స్యాల‌ను కాపాడే వారు కూడా పోలీసులేన‌ని అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పోలీసుల‌కు సాంకేతిక శిక్ష‌ణ అందాల‌న్నారు కేంద్ర మంత్రి.

కాగా జైపూర్ లోని సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ ఆధ్వ‌ర్యంలో ఈ స‌ద‌స్సు నిర్వ‌హిస్తోంది.

Also Read : ఎయిర్ ఇండియాకు డీజీసీఏ నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!