Mamata Banerjee : వందే భార‌త్ పాతబ‌డిన రైలు – దీదీ

నిప్పులు చెరిగిన బీజేపీ

Mamata Banerjee : టీఎంసీ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee) మ‌రోసారి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఆమె ప‌దే ప‌దే బీజేపీని, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల వందే భార‌త్ రైలు ప్రారంభం సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో త‌మ రాష్ట్రానికి రావాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం నిధుల‌ను మంజూరు చేయ‌డంలో వివ‌క్ష చూపుతున్నారంటూ ఆరోపించారు.

తాజాగా మ‌రో సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంలో క‌ల‌కం రేపుతోంది. వందే భార‌త్ ను కొత్త ఇంజ‌న్ తో పున‌రుద్ద‌రించిన రైళ్లు అంటూ ఎద్దేవా చేశారు. గురువారం ఆమె ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. రాష్ట్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర స‌ర్కార్ చేస్తున్న ప‌నిని చూసి టీఎంసీ చీఫ్ , సీఎం మ‌మ‌తా బెనర్జీ(Mamata Banerjee) త‌ట్టుకోలేక పోతోందంటూ బీజేపీ మండిప‌డింది.

ఈ మేర‌కు సీఎంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ . ఆమెకు పాల‌న చేత కావ‌డం లేద‌న్నారు. కావాలాని కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కేంద్రాన్ని, బీజేపీని, మోదీని నిరాధారామైన ఆరోప‌ణ‌లు చేస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొత్త ఇంజ‌న్ తో పున‌రుద్ద‌రించ బ‌డిన పాత రైలు త‌ప్ప మ‌రేమీ కాద‌ని పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ‌.

ఇది పూర్తిగా దురుద్దేశ పూర్వ‌క‌మైన వ్యాఖ్య‌గా కొట్టి పారేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ సూచించారు.

Also Read : ఇండిగో సిఇఓ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!