Nitish Samadhan Yatra : నితీష్ స‌మాధాన్ యాత్ర షురూ

ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అన్న సీఎం

Nitish Samadhan Yatra : దేశ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. స‌మీక‌ర‌ణాలే కాదు మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడు ప్ర‌తి పార్టీ పాద‌యాత్ర జ‌పం చేస్తోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఒక ర‌కంగా దేశంలో చర్చ‌కు దారితీసింది. అంతే కాదు ఆయ‌న‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

దీంతో బీజేపీ ఏమీ అన‌లేక పోతోంది. కానీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతోంది. ఈ త‌రుణంలో 17 ఏళ్ల అనుబంధానికి బీజేపీతో క‌టీఫ్ చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే కాదు ఆయ‌న ఇటీవ‌లే టిబెట్ మ‌త గురువు ద‌లైలామాను క‌లుసుకున్నారు.

అనంత‌రం స‌మాధాన్ యాత్ర పేరుతో ప్ర‌జ‌ల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక బీహార్ సంకీర్ణ స‌ర్కార్ లో కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ కూడా భాగంగా ఉంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు సీఎం అనే కార్య‌క్ర‌మంతో ఎంట్రీ ఇవ్వ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది.

మ‌రో వైపు ఇప్ప‌టికే పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ జ‌న్ ప‌రివ‌ర్త‌న్ పేరుతో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు . ప్ర‌జ‌లను స‌మ‌స్య‌ల‌పై చైత‌న్య‌వంతం చేసే ప‌నిలో ప‌డ్డారు. మ‌రో వైపు ప్ర‌భుత్వాన్నివిమ‌ర్శిస్తున్నారు. ఈ త‌రుణంలో సీఎం స్వ‌యంగా స‌మాధాన్ యాత్ర(Nitish Samadhan Yatra) చేప‌ట్ట‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. నితీశ్ కుమార్ దేశ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన వ్య‌క్తిగా ఉన్నారు.

ఈ యాత్ర రాబోయే ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా ఏమిటో చూపించాల‌ని ప్లాన్ చేశారు నితీశ్ .

Also Read : ష‌హీద్ ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవ‌ర్ సిద్ధం 

Leave A Reply

Your Email Id will not be published!