Supreme Court Judges : నియామ‌కం ఆల‌స్యం సుప్రీం ఆగ్రహం

జ‌డ్జీల నియామ‌కానికి లైన్ క్లియ‌ర్

Supreme Court Judges : కేంద్రంలో న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వానికి న్యాయ వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య రోజు రోజుకు దూరం పెరుగుతోంది. ఇప్ప‌టికే కొలీజియం వ్య‌వ‌స్థపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు. ఆయ‌న ప‌దే ప‌దే కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఆద‌ర బాద‌రాగా నియ‌మించిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హారంపై కోర్టులో విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ అనేది స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ‌. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్య‌త దానిపై ఉంది.

ఒక‌వేళ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఏ స‌మ‌యంలోనైనా ప్ర‌ధాన‌మంత్రిని కూడా ప్ర‌శ్నించే ధైర్యాన్ని క‌లిగి ఉండాలి. లేదంటే అయ్యా అనే స్థాయిలో ఉండ‌కూడ‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా కేంద్రానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ త‌రుణంలో కొలీజియం వ్య‌వ‌స్థ అన్న‌ది కేవ‌లం భార‌త్ లో మాత్ర‌మే ఉంద‌ని ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని ఆరోపించారు కిరెన్ రిజిజు.

ఎక్క‌డైనా చ‌ట్టాలు చేసే పార్ల‌మెంట్ వ్య‌వ‌స్థ‌కు పూర్తి అధికారాలు ఉంటాయ‌ని కానీ కొలీజియం వ్య‌వ‌స్థ‌కు ఉండ‌వ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా జ‌డ్జీల నియామ‌కానికి సంబంధించి ఇప్ప‌టికే కొలీజియం కేంద్రానికి జాబితాను ఖ‌రారు చేస్తూ కేంద్రానికి పంపించింది. కానీ ఇప్ప‌టి దాకా ఆమోదించ‌లేదు. ఇందుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది సుప్రీంకోర్టు. 

ఈ సంద‌ర్భంగా ఏజీ బ‌దులు ఇచ్చారు. మూడు రోజుల్లో 44 మంది జ‌డ్జీల నియామకానికి(Supreme Court Judges) సంబంధించి కేంద్ర స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : కూతుళ్ల‌కు ప‌నితీరుపై సీజేఐ వివ‌ర‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!