Covid19 India : మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో 228 కేసులు 4 మరణాలు
Covid19 India : కరోనా భూతం మళ్లీ మెల మెల్లగా భయాందోళనకు గురి చేస్తోంది. నిన్నటి దాకా అంతగా ప్రభావం చూపని కరోనా ఉన్నట్టుండి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చైనాను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు.
ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. చైనాలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ఎందుకైనా మంచిదని భారత ప్రభుత్వం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్కుల్ ధరలించాలని, భౌతిక దూరం పాటించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించింది కేంద్రం.
ఇక నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు(Covid19 India) గత 24 గంటల్లో మరిన్ని పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇవాల్టి వరకు అందిన సమాచారం మేరకు 228 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది ఆరోగ్య శాఖ. దీంతో మరణాల సంఖ్య ఇప్పటి వరకు భారత్ లో 5,30,714కి చేరుకుంది.
ఇక మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,46,79,547కి చేరుకుందని కుటుంబ మంత్రిత్వ శాఖ పేర్కొంది. క్రియాశీల కేసులు 2,503కు తగ్గాయి. రోజూ వారీ సానుకూలత రేటు 0.10 శాతంగా నమోదైందని, వారం వారీ సానుకూలత రేటు 0.12 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : ఫిబ్రవరి 15 లోగా బదులివ్వండి – సుప్రీం