Revanth Reddy Yatra : 26 నుంచి రేవంత్ పాదయాత్ర
జోగులాంబ లేదా జోడేఘాట్ నుంచి
Revanth Reddy Yatra : దేశంలో పాదయాత్రల కాలం నడుస్తోంది. ఒకరిని చూసి మరొకరు యాత్రకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండేది.
కానీ ఈసారి బరిలో నాలుగైదు పార్టీలు ఉన్నా ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టింది. ఇప్పటికే 10 రాష్ట్రాలలో పర్యటించారు. ప్రస్తుతం హర్యానాలో కొనసాగుతోంది యాత్ర.
ఇందులో భాగంగా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా తయారైనట్లు సమాచారం. రోజుకు 19 కిలోమీటర్ల చొప్పున మొత్తం 126 రోజుల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది(Revanth Reddy Yatra).
అయితే ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మూడు ప్రాంతాలను ఇప్పటికే పార్టీ గుర్తించింది. వాటిలో భద్రాచలం, జోగులాంబ గద్వాల జిల్లా , జోడేఘాట్ లలో ఏదో ఒక దానిని ఖరారు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ను తప్పించింది హైకమాండ్ . మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేను నియమించింది. ఇప్పటికే పాదయాత్రకు సంబంధించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కూడా చర్చించినట్లు తెలిపారు.
Also Read : ఓవైసీకి రెండు చోట్ల ఓటు – కాంగ్రెస్