Centre Bans PAFF : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ పై నిషేధం

జేషే ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన సంస్థ

Centre Bans PAFF : కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టికే దేశంలో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్న జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌పై నిషేధం విధించింది. శ‌నివారం జైషే మ‌హ్మ‌ద్ (జేఇఎం) సంస్థ‌కు చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్‌) పై(Centre Bans PAFF) వేటు వేసింది.

ఈ ఫ్రంట్ ఆర్గ‌నైజేష‌న్ ల‌ను ఉగ్ర‌వాద సంస్థగా కేంద్రం ప్ర‌క‌టించింది. చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల (నివార‌ణ‌) చ‌ట్టం 1967 కింద మొద‌టి షెడ్యూల్ లోని సీరియ‌ల్ నంబ‌ర్ 6 లో జాబితా చేయ‌డింది జేఎంఇ. దీనికి అనుబంధంగా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ కొన‌సాగుతూ వ‌స్తోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా పీఏఎఫ్ఎఫ్ 2019 సంవ‌త్స‌రంలో ఏర్పాటైంది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ పీఏఎఫ్ఎఫ్ కంటిన్యూగా భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర రాష్ట్రాల నుండి జ‌మ్మూ కాశ్మీర్ లో ఉన్న పౌరుల‌ను బెదిరింపుల‌కు గురి చేస్తూ వ‌స్తోంద‌ని తెలిపింది.

ఈ మేర‌కు కేంద్ర హోం వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించి అధికారికంగా వెల్ల‌డించింది. ఇక ఎంహెచ్ఏ ప్ర‌కారం ఇత‌ర సంస్థ‌ల‌తో పాటు పీఏఎఫ్ఎఫ్ హింసాత్మ‌క ఉగ్ర‌వాద చ‌ర్య‌లు, జ‌మ్మూ కాశ్మీర్ , భార‌త దేశంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చింద‌ని తెలిపింది. సామాజిక మాధ్య‌మాల‌లో ఆయ‌క్టివ్ గా ఉంద‌ని పేర్కొంది.

తుపాకులు, మందుగుండు సామాగ్రి, పేలుడు ప‌దార్థాల‌ను నిర్వ‌హించ‌డంలో రిక్రూట్ మెంట్ , శిక్ష‌ణ కోసం ఇత‌ర సంస్థ‌లతో పాటు పీఏఎఫ్ఎఫ్ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

Also Read : రామ మందిరం ద్వేష పూరిత స్థ‌లం

Leave A Reply

Your Email Id will not be published!