Fauja Singh Sarari : పంజాబ్ మంత్రి ఫౌజా సింగ్ రాజీనామా

వెల్లువెత్తిన అవినీతి ఆరోప‌ణ‌లు

Fauja Singh Sarari : పంజాబ్ మంత్రివ‌ర్గంలో మ‌రో వికెట్ ప‌డింది. అవినీతి ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున రావ‌డంతో ఫౌజా సింగ్ స‌రారీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. శ‌నివారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర కేబినెట్ లో ఉద్యాన‌వ‌న శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

స్కాం ప్లాన్ ను రూపొందించిన కేసులో ఫౌజా సింగ్ స‌రారీ(Fauja Singh Sarari) పేరు ప్ర‌ధానంగా వినిపించింది. మంత్రి త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ కు పంపించారు. రాజీనామా ప‌త్రం అందుకున్న వెంట‌నే సీఎం ఆమోదించిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌భుత్వ అధికారుల స‌హాయంతో కొంత మంది కాంట్రాక్ట‌ర్ల‌ను ట్రాప్ చేసి డ‌బ్బు దోచుకునే ప‌థ‌కానికి సంబంధించి త‌న స‌న్నిహితుడితో ఉద్దేశించిన సంభాష‌ణ ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఒక ర‌కంగా ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇర‌కాటంలో పడేలా చేసింది. అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా పాల‌న సాగిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు భ‌గ‌వంత్ మాన్.

దీంతో సీఎం సూచ‌న మేర‌కు ఫౌజా సింగ్ స‌రారీ త‌ప్పుకునేందుకు ఒప్పుకున్న‌ట్లు తెలిసింది. అయితే రాజీనామా ప‌త్రంలో మాత్రం ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా తాను మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు మాత్ర‌మే లేఖ‌లో పేర్కొన్నారు ఫౌజా సింగ్ స‌రారి.

తాజాగా మంత్రి ప‌ద‌వి నుంచి తప్పుకోవ‌డంతో మంత్రివ‌ర్గంలో భారీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రగ‌నుంది.

Also Read : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ పై నిషేధం

Leave A Reply

Your Email Id will not be published!