PM Modi : సైబ‌ర్ సెక్యూరిటీపై ఫోక‌స్ పెట్టాలి

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సైబ‌ర్ భ‌ద్ర‌త‌ను పెంపొందించ‌డం తో పాటు దానిపై ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతే కాకుండా భౌతిక , సామాజిక మౌలిక స‌దుపాయాల అభివృద్ది గురించి కూడా ప‌ట్టించు కోవాల‌ని స్ప‌ష్టం చేశారు మోదీ. న్యూఢిల్లీ లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల రెండో జాతీయ స‌ద‌స్సులో పాల్గొన్నారు.

కేంద్ర క్యాబినెట్ సెక్ర‌ట‌రీ రాజీవ్ గౌబా , ప్ర‌ధాన మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ పీకే మిశ్రా పాల్గొన్నారు. వెనుక‌బడిన జిల్లాల‌ను అభివృద్ది చేసే ల‌క్ష్యంతో ఇదే త‌ర‌హాలో ఆస్పిరేష‌న్ బ్లాక్ ప్రోగ్రామ్ ను పీఎం ప్రారంభించారు. అభివృద్ది చెందిన దేశంగా ఉండేందుకు మౌలిక స‌దుపాయాలు, పెట్టుబ‌డులు, ఆవిష్క‌ర‌ణ‌లు , చేర్చ‌డం అనే నాలుగు స్తంభాల‌పై భార‌త దేశం దృష్టి సారిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

మూడ‌వ‌, చివ‌రి రోజు రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌పై జ‌రిగిన రెండో జాతీయ స‌ద‌స్సు ప్ర‌ధాని అధ్య‌క్ష‌త వ‌హించారు. ప్రపంచ స‌ర‌ఫ‌రా గొలుసులో స్థిర‌త్వాన్ని తీసుకు రావ‌డానికి ప్ర‌పంచం మొత్తం భార‌త దేశం వైపు చూస్తోంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఎంఎస్ఎంఈ రంగాన్ని గ్లోబ‌ల్ ఛాంపియ‌న్స్ గా మార్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi).

రాష్ట్రాలు నాణ్య‌త‌పై దృష్టి సారించి భార‌త్ ఫ‌స్ట్ అనే విధానంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా ముందుండి న‌డిపిస్తేనే దేశం దీని పూర్తి ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌ల‌ద‌న్నారు. కాలం చెల్లిన చ‌ట్టాలు, నిబంధ‌న‌ల‌ను పూర్తిగా తొల‌గించేందుకు దృష్టి పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : పాత రైలుకు కొత్త రంగు వేశారు

Leave A Reply

Your Email Id will not be published!