Ashok Gehlot : పాత పెన్ష‌న్ స్కీం బెట‌ర్ – అశోక్ గెహ్లాట్

అహ్లూవాలియా కామెంట్స్ పై స్పంద‌న

Ashok Gehlot : పాత పెన్ష‌న్ స్కీం వ‌ల్ల భార‌త దేశం అభివృద్ది చెందింద‌న్న ఆర్థిక వేత్త మాంటెక్ అహ్లూ వాలియా చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ఉద్యోగులు త‌మ 35 ఏళ్ల స‌ర్వీసు త‌ర్వాత సుర‌క్షితంగా భావించే అర్హ‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. పాత పెన్ష‌న్ ప‌థ‌కం వ‌ల్ల ఎంతో మేలు జ‌రిగింద‌న్నారు.

దీని వ‌ల్ల ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌కు కొంత జీవితం ప‌ట్ల భ‌ద్ర‌త ఏర్ప‌డింద‌న్నారు. ఈ ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదేన‌ని పేర్కొన్నారు. ఉద్యోగులు త‌మ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్ పొంద‌డం లేద‌ని ఒత్తిడికి లోన‌వుతార‌ని అన్నారు. దీని వ‌ల్ల పూర్తిగా సుప‌రిపాల‌న‌లో పాలు పంచుకోలేర‌ని , ప‌నిపై ఫోక‌స్ పెట్ట‌లేర‌ని పేర్కొన్నారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).

ఉద్యోగుల‌కు పెన్ష‌న్ సౌక‌ర్యం అనేది ఉండాల‌ని అభిప్రాయ ప‌డ్డారు సీఎం. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ సీఎం చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇప్ప‌టికే చాలా చోట్ల పెన్ష‌న్ సిస్ట‌మ్ కు మంగ‌ళం పాడాయి ప్ర‌భుత్వాలు. మ‌రో వైపు త్వ‌ర‌లో రాజ‌స్థాన్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు అశోక్ గెహ్లాట్.

కేవ‌లం రూ. 5 కే సౌక‌ర్య‌వంత‌మైన భోజ‌నాన్ని ఏర్పాటు చేశారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. మ‌రో వైపు పారిశ్రామిక‌వేత్త‌లతో స‌ద‌స్సు ఏర్పాటు చేశారు. ఇక్క‌డ అదానీ గ్రూప్ ఏకంగా రూ. 68 వేల కోట్ల పెట్టుబ‌డులు పెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. ద‌శ‌ల వారీగా మంజూరు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు గౌతమ్ అదానీ.

Also Read : రాహుల్ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పండి

Leave A Reply

Your Email Id will not be published!