Balbir Singh Sworn : బల్బీర్ సింగ్ కు మంత్రి పదవి
ఆరోగ్య శాఖ కేటాయింపు
Balbir Singh Sworn : పంజాబ్ లో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పారదర్శక పాలన వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే అవినీతి నిర్మూలనే తమ ధ్యేయమని, అదే తమ మొదటి ప్రయారిటీ అని స్పష్టం చేశారు సీఎం భగవంత్ మాన్.
తాజాగా అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్ బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫౌజ్ సింగ్ సరారీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు లంచం అడిగినా లేదా అక్రమాలకు పాల్పడినా వెంటనే తనకు వీడియో లేదా వాట్సాప్ కు మెస్సేజ్ చేయాలని సీఎం ప్రకటించారు. ఇదే సమయంలో సరారీ స్థానంలో కొత్తగా బల్బీర్ సింగ్ కు(Balbir Singh Sworn) ఛాన్స్ ఇచ్చారు సీఎం. ఈ మేరకు ఆయనకు కేబినెట్ లో చోటు కల్పిస్తూ ఆరోగ్య శాఖను కేటాయించారు భగవంత్ మాన్.
ఇదే సమయంలో అంతకు ముందు కూడా అవినీతి ఆరోపణల కారణంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విజయ్ సింగ్లాను మంత్రి పదవి నుంచి తప్పించారు సీఎం.
ఇదిలా ఉండగా ఆప్ అధికారంలోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే ఇద్దరు కీలక మంత్రులకు మంగళం పాడారు సీఎం. పార్టీ కంటే వ్యక్తులు గొప్పవారు కాదని, పార్టీ రూల్స్ కు కట్టుబడి ఉండాల్సిందేనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు భగవంత్ మాన్.
ఇక శాఖా పరమైన టెండర్లలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపై విజయ్ సింగ్లా పై వేటు వేశారు. మొత్తంగా ఆప్ సీఎం దెబ్బకు మంత్రులు కిమ్మనడం లేదు.
Also Read : ప్రగ్యా ఠాకూర్ పై మాజీ అధికారుల గుస్సా