Jyotiraditya Scindia : శంక‌ర్ మిశ్రాపై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా

Jyotiraditya Scindia : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఎయిర్ ఇండియా విమానంలో మూత్రం చేసిన ఘ‌ట‌న‌. ఇది జ‌రిగి కొన్ని రోజులు అయిన‌ప్ప‌టికీ బాధితురాలైన వృద్ధ మ‌హిళ స్పందించింది. ఈ మేర‌కు ఫిర్యాదు చేసింది. ఎయిర్ ఇండియా సిఇఓకు లేఖ ద్వారా త‌న‌కు జ‌రిగిన ఇబ్బంది గురించి తెలిపింది.

దీంతో విచార‌ణ చేప‌ట్టిన ఎయిర్ ఇండియా ఇందుకు సంబంధించి న‌లుగురు సిబ్బందిని తొల‌గించింది. అంతే కాకుండా మ‌హిళ‌పై మూత్ర విస‌ర్జ‌న చేసిన శంక‌ర్ మిశ్రాను ఎట్ట‌కేల‌కు బెంగ‌ళూరులో పోలీసులు చాక‌చ‌క్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia) .

మీడియాతో మాట్లాడిన ఆయ‌న శంక‌ర్ మిశ్రాపై త‌దుప‌రి చ‌ర్య‌లు త‌ప్ప‌క ఉంటాయ‌ని పేర్కొన్నారు. తాము ఎవ‌రినీ ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇప్ప‌టికే డీజీసీఏ ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింద‌న్నారు. ఇక ముందు నుంచీ అన్ని ఎయిర్ లైన్స్ లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

గ‌త ఏడాది 2022 న‌వంబ‌ర్ 26న న్యూయార్క్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌భ్య స‌మాజం త‌ల వంచుకునేలా చేయ‌డంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తమైంది. ఈ మొత్తం ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు జ్యోతిరాదిత్యా సింధియా.

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్ర‌క్రియ‌లు పూర్త‌య్యాక చ‌ర్య‌లు త‌ప్ప‌క ఉంటాయ‌న్నారు. ఇదే క్ర‌మంలో విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల‌ని సూచించారు మంత్రి.

Also Read : మూత్రం’ ఘ‌ట‌న సిఇఓ క్ష‌మాప‌ణ

Leave A Reply

Your Email Id will not be published!