AP Govt Appoints : కందుకూరు..గుంటూరు ఘటనపై కమిషన్
చంద్రబాబుకు ఏపీ సర్కార్ షాక్
AP Govt Appoints : సందింటి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ సంచలన నిర్ణయం(AP Govt Appoints) తీసుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సభలు. ఏపీలోని కందుకూరు, గుంటూరులలో నిర్వహించిన సభల్లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
కందుకూరు సభలో జరిగిన తొక్కిసలాటో ఎనిమింది మంది చని పోతే గుంటూరులో చంద్రన్న కానుక పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ముగ్గురు మహిళలు ప్రాణాలు వదిలారు. ఈ మొత్తం ఘటనలు కలకలం రేపాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహించాలని మంత్రులు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని అయితే ఏకంగా బాబుపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం తన వ్యక్తిగత ప్రచారం కోసం ఇలా సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తారా అంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. ఇదిలా ఉండగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే గతంలో ఎన్నడూ లేని రీతిలో సీరియస్ గా స్పందించారు.
ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు. గతంలో నర హంతుకులుగా పేరొందిన హిట్లర్ , ముస్సలోనీ తర్వాత నాకు బాబుకనిపిస్తున్నరాంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఈ మొత్తం కందుకూరు, గుంటూరు ఘటనలపై జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేష శయనా రెడ్డితో కమిషన్(AP Govt Appoints) ఏర్పాటు చేసింది.
Also Read : నాగబాబు కామెంట్స్ రోజా సీరియస్