MP Kanimozhi : త‌మిళుల మ‌నోభావాలు ముఖ్యం – క‌నిమొళి

గౌర‌వించాల‌ని డీఎంకే ఎంపీ సూచ‌న‌

MP Kanimozhi : త‌మిళ‌నాడులో డీఎంకే వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ గా మారి పోయింది. ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. త‌మిళ‌నాడుకు బ‌దులు త‌మిళ‌గం అనే పేరు బావుంటుంద‌ని గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి పేర్కొన‌డం, దేశ చ‌రిత్ర గ‌తిలో కీల‌క‌మైన పాత్ర పోషించిన పెరియార్ , అంబేద్క‌ర్ , త‌దిత‌రుల పేర్ల‌ను ప్ర‌స్తావించ‌కుండా అవ‌మానించ‌డం, ఆపై అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది.

ప్ర‌ధానంగా ఆయ‌న ప్ర‌సంగం, త‌మిళ‌గం పేరును ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు డీఎంకే ఎంపీ క‌నిమొళి. గ‌వ‌ర్న‌ర్ ర‌వి ప‌ట్ల ఆ పార్టీ నేత శివాజీ కృష్ణ‌మూర్తి చేసిన అవ‌మాన‌క‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌తినిధి ఎవ‌రైనా స‌రే రాష్ట్రానికి వేరే పేరు పెట్ట‌డం ద్వారా త‌మిళుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

అందుకే త‌మిళులు త‌ట్టుకోలేక పోయార‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా కామెంట్స్ చేయ‌డం గ‌వ‌ర్న‌ర్ కు త‌గ‌ద‌ని పేర్కొన్నారు క‌నిమొళి. ఇదిలా ఉండ‌గా పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు డీఎంకే నేత శివాజీ. అయితే ప్ర‌జ‌ల గురించి అగౌర‌వంగా మాట్లాడడాన్ని తాము ఎవ‌రినీ ప్రోత్స‌హించ‌మ‌న్నారు క‌నిమిళి(MP Kanimozhi).

స్వంత రాష్ట్రాన్ని ఏమ‌ని పిల‌వాల‌ని చెప్ప‌డం ద్వారా త‌మిళుల మ‌నో భావాల‌ను దెబ్బ తీయ‌లేర‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ. రాష్ట్ర‌ప‌తి ఎవ‌రైనా ఈ విష‌యాన్ని గుర్తించాల‌న్నారు క‌నిమిళి. పొంగ‌ల్ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు చెన్నైకి వ‌చ్చిన సంద‌ర్భంగా క‌నిమొళి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను గౌర‌వించ‌డం నేర్చుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ క‌నిమొళి.

Also Read : జ‌న‌హిత‌మే బీజేపీ ఎజెండా – మోడీ

Leave A Reply

Your Email Id will not be published!