Kapil Sibal : న్యాయ వ్యవస్థపై కన్నేసిన కేంద్రం
కపిల్ సిబల్ షాకింగ్ కామెంట్స్
Kapil Sibal : ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ , మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు చేశారు. న్యాయ వ్యవస్థను కబ్జా చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తుల నియామక నిబంధనలపై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేశవానంద భారతి కేసుకు సంబంధించిన తీర్పులో పేర్కొన్న ప్రాథమిక నిర్మాణ సిద్దాంతం ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ఒకవేళ అది లోపభూయిష్టంగా ఉంటే బహిరంగంగా చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందన్నారు. న్యాయ శాఖ మంత్రికి కోర్టుల పనితీరుపై అంతగా అవగాహన లేక పోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అభిప్రాయపడ్డారు కపిల్ సిబల్(Kapil Sibal) .
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేసీ) మరో అవతారంలో పరిస్థితిని సృష్టించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలో నియామకాలపై ప్రభుత్వం తుది మాట చెప్ప లేదన్నారు. దీనిపై తాము తీవ్ర అభ్యంతరం తెలియ చేస్తున్నామని పేర్కొన్నారు కపిల్ సిబల్.
ఎన్జేసీ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ మళ్లీ విమర్శించిన కొద్ది రోజుల తర్వాత కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించవచ్చు..ఇందులో ఎలాటి అభ్యంతరం లేదు. కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని సవరించ కూడదనే సుప్రీంకోర్టు తీర్పుతో తాను విభేదిస్తున్నానని స్పష్టం చేశారు మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి(Kapil Sibal) .
Also Read : కొలీజియం వర్సెస్ కేంద్రం