Kanhaiya Kumar : ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండూ ఒక్కటే – కన్హయ్య
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ యువ నేత
Kanhaiya Kumar : కాంగ్రెస్ యువ నాయకుడు, ఎమ్మెల్యే కన్హయ్య కుమార్(Kanhaiya Kumar) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ , బారతీయ జనతా పార్టీ రెండూ ఒక్కటేనని , ఒకే గ్లాసు లో ఉన్న నీళ్లేనని మండిపడ్డారు. సోమవారం పంజాబ్ లోని హోషియార్ పూర్ లో కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై నిప్పులు చెరిగారు. కాసాయ పార్టీకి చెందిన మౌత్ పీస్ లు ఆర్గనైజర్, పాంచజన్య లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు మోహన్ భగవత్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు కన్హయ్య కుమార్. యువ నేతతో అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవలి ఇంటర్వ్యూను ప్రస్తావించారు కన్హయ్య కుమార్. ఆర్ఎస్ఎస్ చెట్టు అని భారతీయ జనతా పార్టీ పండు అని కానీ తాము రెండింటిని వేర్వేరుగా చూడలేమని స్పష్టం చేశారు కాంగ్రెస్ యువ నేత. మితవాద సంస్థ భావజాలం పూర్తిగా రాజకీయాలపై ఆధారపడి ఉందని కన్మయ్య కుమార్(Kanhaiya Kumar) స్పష్టం చేశారు.
వారు తమను తాము సాంస్కృతిక సంస్థగా చెప్పుకున్నా వారి భావజాలం పూర్తిగా రాజకీయాలపై ఆధారపడి ఉంటుందన్నారు కాంగ్రెస్ యువ నాయకుడు. మతం దేశానికి చెందినది కానీ మతతత్వం కాదన్నారు కన్హయ్య కుమార్. మత చిహ్నాలను ఉపయోగించి ఆర్ఎస్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
భూస్వామ్యాన్ని మతాన్ని కలిపితే దాన్ని రాజకీయం అంటారని పేర్కొన్నారు కన్హయ్య కుమార్.
Also Read : పవర్ లోకి వస్తే రూ. 2 వేల సాయం