Kiren Rijiju CJI : కొలీజియంలో కేంద్ర ప్రతినిధి ఉండాలి
సీజేఐ చంద్రచూడ్ కు కిరణ్ రిజిజు లేఖ
Kiren Rijiju CJI : సుప్రీంకోర్టుకు కేంద్రానికి మధ్య మరోసారి వివాదానికి దారి తీసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు కొలీజియంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖ రాశారు. పారదర్శకతను నింపేందుకు న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో కేంద్రం జోక్యం అవసరమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
అయితే కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు గట్టిగా సమర్థించింది. కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, ఆప్ వంటి విపక్షాలు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంను సమర్థించాయి. న్యాయ శాఖ మంత్రి లేఖ ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ముందుకు వెనుకకు సాగుతోంది.
న్యాయమూర్తుల నియామకాలపై నిర్ణయం తీసుకునే సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు భారత ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్రచూడ్ కు(Kiren Rijiju CJI) లేఖ రాశారు. ఇది పారదర్శకత, ప్రజా జవాబుదారీతనాన్ని ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.
ఇది గత ఏడాది నుండి కేంద్ర ప్రభుత్వం , న్యాయ వ్యవస్థ మధ్య వివాదాన్ని విస్తృతంగా పెంచింది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్ కమిషన్ ని కొట్టి వేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు సూచించిన ఖచ్చితమైన తదుపరి చర్య ఈ లేఖ అని కిరెన్ రిజిజు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కిరెన్ రిజిజు సీజేఐకి లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థపై పట్టు సాధించడం తప్ప మరొటి కాదని పేర్కొన్నారు.
ఇది అత్యంత ప్రమాదకరం. జ్యుడీషియల్ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : సీజేఐపై విచారణకు కోర్టు నిరాకరణ